Tata Chemicals Chairman : టాటా కెమికల్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా
టాటా కెమికల్స్ చైర్మన్, డైరెక్టర్ పదవి నుంచి చంద్రశేఖరన్ నేడు వైదొలగనున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆ సంస్థ పేర్కొంది. బుధవారం జరిగిన సమావేశంలో టాటా కెమికల్స్ డైరెక్టర్ల బోర్డు చంద్రశేఖరన్ నుండి రాజీనామా అభ్యర్థనను అందుకున్నట్లు కంపెనీ ఒక " ప్రకటనలో తెలిపింది. 'టాటా కెమికల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ పదవి నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణ యాన్ని అధికారికంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత, భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత బాధ్యతల నుంచి తప్పు కోవాలని నిర్ణయించుకున్నాను.టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా భావిస్తున్నాను. నా పదవీకాలంలో మద్దతు, సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు" అని తెలిపారు.