Procter & Gamble : ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ లో ఉద్యోగులకు ఉద్వాసన

Update: 2025-06-07 08:15 GMT

ప్రాక్టర్ అండ్ గాంబెల్ వచ్చే రెండేళ్లలో మొత్తం ఉద్యోగుల్లో 6 శాతానికి సమానమైన 7000 మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. తగ్గిన వినియోగదారుల డిమాండ్, అధిక వ్యయాలు, సుంకాల అనిశ్చితి వంటి కారణాలతో కంపెనీ కొత్త పఎనర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు కంపెనీ గురువారం నాడు ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కన్జ్యూమర్ గూడ్స్ ఉత్పత్తి సంస్థగా ఉన్ ప్రాక్టర్ అండ్ గాంబెల్ కొన్ని మార్కెట్ల నుంచి కొన్ని రకాల ఉత్పత్తులు, బ్రాండ్ల నుంచి తప్పుకోవాలని కూడా భావిస్తోందని ప్యారిస్ లో జరిగిన డ్యూయుష్ బ్యాంక్ వినియోగ దారుల సమా వేశంలో కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఈ సంవత్సరం వినియోగదారుల వ్యయాలు తగ్గు తాయని భావిస్తున్నందున పీ అండ్ జీతో పాటు యూనిలీవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వినియోగ వస్తువుల తయారీదారులు వ్యయాలను నియంత్రించుకోవాలని భావిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ధరల ఒత్తిడి ఉంటుందని ఈ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. సవాల్తో కూడుకుని ఉన్న ఈ పోటీలో గెలి చేందుకే తాము ఈ విధానాన్ని అనుసరిస్తున్నా మని పీ అండ్ జీ ప్రతినిధి వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల మూలంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

పీ అండ్ జీకి అతి పెద్ద మార్కెట్ ఉన్న అమెరి కాలోనూ మాంద్యం భయాలు నెలకొన్నాయి. కంపెనీ ముడి పదార్ధాలు, ప్యాకేజీజింగ్ సామాగ్రితో పాటు కొన్ని ఉత్పత్తులను కూడా కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ విధించిన సుంకాల మూలంగా అమెరికా కంపెనీలకు 34 బిలియన్ డాలర్ల నష్టంతో పాటు, అమ్మకాల తగ్గడం, వస్తువుల ధరలు పెరగడం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంఉందని రాయిటర్స్ విశ్లేషించింది. 

Tags:    

Similar News