ఢిల్లీ ఎన్నికల్లో బిలియనీర్లు ఐదుగురు, ఆస్తులు లేని అభ్యర్థులు ముగ్గురు పోటీ..

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఐదుగురు సంపన్న అభ్యర్థులలో ముగ్గురు బిజెపికి చెందిన వారు ఉన్నారు.;

Update: 2025-01-28 06:29 GMT

ఆస్తులు ఉన్నవాడికే అధికారం.. డబ్బున్న వాడిదే రాజ్యం.. ప్రజాసేవ చేయాలని ప్రగల్భాలు పలికే వారంతా చిత్త శుద్ది ఉన్న రాజకీయ నేతలనుకుంటే పొరపాటే.. కాసులుంటేనే కాన్ స్ట్యుయెన్సీలో పోటీ చేసేందుకు సీటు దక్కుతుంది. ఆస్తులు లేకపోయినా నేను పోటీ చేస్తానంటే ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వదు.. ఇండిపెండెంట్ గా పోటీ చేసుకోవలసిందే.. అదృష్టం బావుంటే అతడూ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అలాంటివి ఎక్కడో ఒకటీ అరా మాత్రమే జరుగుతుంటుంది. ఇప్పుడంతా డబ్బున్నవాడిదే హవా. రాజకీయాలంటేనే డబ్బు.. డబ్బుంటేనే రాజకీయాలు చేయాలి.. అదీ నేటి వ్యవస్థ పని తీరు.

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఐదుగురు సంపన్న అభ్యర్థులలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు బిజెపి అభ్యర్దులు ఉన్నారు. వారిలో అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నది షకూర్ బస్తీ వాసి అభ్యర్థి కర్నైల్ సింగ్. దాదాపు రూ. 260 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు.

రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యంలో భారీ వ్యత్యాసం ఉంది.  రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న ఐదుగురు బిలియనీర్లు ఉండగా, ముగ్గురు అభ్యర్థుల వద్ద పైసా కూడా లేదు. వారి ఎన్నికల అఫిడవిట్‌లలోని ఆర్థిక వివరాలు వారికి "జీరో" ఆస్తులు ఉన్నట్లు చూపుతున్నాయి.

ఇతర నలుగురు బిలియనీర్ పోటీదారులలో బిజెపికి చెందిన మంజీందర్ సింగ్ సిర్సా (రూ. 249 కోట్లు), కాంగ్రెస్‌కు చెందిన గుర్చరణ్ సింగ్ (రూ. 131 కోట్లు), బిజెపికి చెందిన పర్వేష్ వర్మ (రూ. 116 కోట్లు), ఆప్‌కి చెందిన ఎ ధన్వతి చండేలా (రూ. 110 కోట్లు) ఉన్నారు. రాజౌరీ గార్డెన్ నుంచి సిర్సా, చండేలా పోటీ చేస్తున్నారు. సింగ్ కృష్ణ నగర్ నుంచి, వర్మ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

పైసా కూడా ఆస్తులు లేని ముగ్గురు అభ్యర్థులలో రాష్ట్రీయ రిపబ్లికన్ పార్టీకి చెందిన షబానా శీలం పూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు; మటియాలా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి యోగేష్ కుమార్ మరియు రాష్ట్రీయ రిపబ్లికన్ పార్టీ నుండి మాటియాలా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో అభ్యర్థి మొహిందర్ సింగ్.

కనీస సంపద ఉన్నవారిలో రూ. 6,586 ఆస్తులను నివేదించిన అశోక్ కుమార్ (ఇండిపెండెంట్) మరియు రూ. 9,500 డికాల్ చేసిన అనిత (ఇండిపెండెంట్) ఉన్నారు. అభ్యర్థుల సగటు ఆస్తులు పార్టీల మధ్య గణనీయమైన తేడాలను వెల్లడిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులు సగటున రూ.22.9 కోట్ల ఆస్తులతో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ రూ.14.4 కోట్లు, ఆప్ రూ.11.7 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Tags:    

Similar News