Gas Cylinder Prices : గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను 14రూపాయల 50పైసలు మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన కొత్త ధర మే 1 నుండి అమలులోకి వస్తుంది. మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. గ్యాస్ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.రేట్ల తగ్గింపు తరువాత, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 1747 రూపాయలుగా ఉంది.. ముంబైలో1699, కోల్‌కతాలో 1851, చెన్నైలో 1906, హైదరాబాద్‌లో 1969 వద్ద ఉన్నాయి. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు వంటి కారకాల వల్ల.. ఎల్‌పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.