భారత క్రికెట్ జట్టు ఆటగాడు హార్ధిక్ పాండ్యా, భార్య నటాషాలు తమ గారాల కుమారుడు అగస్త్య జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. విండీస్ పర్యటనలో ఉన్న హార్ధిక్ అగస్త్య 3వ జన్మదినం సందర్భంగా వేడుకలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తన కుమారుడిపై ఉన్న ప్రేమను ఒలకబోస్తూ, తనను ఆడిస్తూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి. కుమారుడితో కలిసి డ్రమ్స్ వాయిస్తూ కనిపించాడు.
నటాషా, హార్ధిక్ జంటకి 2021లో జులై 30న అగస్త్య జన్మించాడు. 2020 సంవత్సరంలో నటాషాకి ప్రేమను వ్యక్తపరిచిన హార్ధిక్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. విండీస్ పర్యటనలో ఉన్న హార్ధిక్ పాండ్యా, రోహిత్ ఆడనుందున భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మిడిలార్డర్ వైఫల్యంతో భారత్ మ్యాచ్ ఓడింది.