తన భార్య ధనశ్రీ వర్మకు టీమ్ఇండియా బౌలర్ చాహల్ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించారు.. ఈ నేపథ్యంలో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ RJ మహ్వాష్ ఇన్‌స్టాలో చేసిన పోస్టు వైరలవుతోంది. ‘అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉంచిన ఆ దేవునికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను చాహల్ కూడా లైక్ చేయడం గమనార్హం.
భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ IPL జట్టులో ఇంకా చేరకుండా ఉన్నారు.