బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. బ్యాంకాక్ లో తీవ్రస్థాయిలో భూకంపం రావడంతో ఒక భవనంలోని 35వ అంతస్తులో ఉన్న ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, మిగతా కుటుంబ సభ్యులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడ్డారు. వెంటనే అక్కడి బహుళ అంతస్తులు నేలమట్టమయ్యాయన్నారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఒకరినొకరు కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.