Tata Harrier EV : మార్కెట్లోకి టాటా ఈవీ హారియర్.. రేంజ్, రేటు తెలుసుకోండి

Update: 2025-06-04 10:15 GMT

టాటా మోటార్స్ కంపెనీ తన ప్రీమియర్ సయూవీ హారియర్ విద్యుత్ వేరియంట్ను మంగళవారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. విలాసవంత మైన కార్లలో లభించే అనేక ఫీచర్లను వినియోగదారులకు టాటా మోటార్స్ ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. యాక్టివ్ ఈవీ ప్లస్ ప్లాట్ ఫామ్ పై ఈ కారును రూపొందించింది. ఎస్ యూవీ విభాగంలో తగ్గుతున్న మార్కెట్ షేరును హారియర్ ఈవీతో పెంచుకోవాలని, నెలకు 50,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కారు నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఈ కారు బ్యాటరీ ప్యాక్కు లైఫ్ టైమ్ వారెంటీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

హారియర్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర 21.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కారు బుకింగ్స్ ను జులై 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని ఎంఐడీసీ సర్టిఫై చేసింది. టాటా హయర్ ఈవీ0-100 కిలోమీటర్ల స్పీడ్ను కేవలం 6.3 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ శ్రేణిలో ఇదే వేగవంతమైన ఈవీగా కంపెనీ పేర్కొంది. డ్రైవింగ్లోశాండ్, రాక్ క్రాల్, బూస్ట్మడ్, ట్రాన్స్పరెంట్ మోడ్, ఆఫ్ రోడ్ అసిస్ట్ వంటి ఆరు రకాల మోడ్లు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ మోడ్లో వాహనం కింద రోడ్డును నేరుగా స్క్రీన్ లో చూడవచ్చు. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు నుంచి మరో కారును కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందులో 14.5 అంగుళాల శామ్సంగ్ నియో క్యూఎల్ఈడీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. దీనిని జేబీఎల్ బ్లాక్ 10 స్పీకర్ సిస్టమ్, డాల్బీ ఆట్మోస్ కు అనుసంధానించారు. కారులో రిమోట్ ఫీచర్లు కూడా అదనపు ఆకర్షణ గా ఉన్నాయి. ఆటోపార్క్ అండ్ సమన్ మోడ్ సాయంతో రిమోట్ పార్కింగ్ చేయించవచ్చు. క్రూజ్ కంట్రోల్, లైన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 7 ఎయిర్ బ్యాగ్లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News