Black Fungus: ఆందోళన కలిగిస్తోన్న బ్లాక్ ఫంగస్

బ్లాక్ ఫంగస్ కళ్లపై ప్రభావం చూపిస్తున్నందున రోగులను నగరంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Update: 2021-05-18 07:21 GMT

Black Fungus: రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవడంతో అందరిలో ఆందోళన నెలకొంది. రెండు రోజుల్లోనే 23 మంది రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు అధికారులు వివరిస్తున్నారు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శంకర్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోగులు హైదరాబాద్ కు తరలి వస్తున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అయితే ఈ బ్లాక్ ఫంగస్ కళ్లపై ప్రభావం చూపిస్తున్నందున రోగులను నగరంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితులకు కన్ను వాయడం, కంటి నొప్పి లాంటి లక్షణాలు ఉన్న 14 మందిని చికిత్స కోసం సరోజినిదేవి ఆస్పత్రికి తరలించారు. అత్యవసరమైన రోగులను మాత్రమే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. కంటి నొప్పితో పాటు ముఖం వాపు ఉండడంతో రోగులకు చికిత్స నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News