బ్లడ్ తక్కువగా ఉంటే ఈ పదార్థాలతో చేసిన లడ్డు రోజుకి ఒకటి..

ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం, నీరసం రావడం ఇవన్నీ శరీరంలో తగినంత రక్తం

Update: 2021-09-09 04:57 GMT

ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం, నీరసం రావడం ఇవన్నీ శరీరంలో తగినంత రక్తం లేకపోతే జరుగుతుంటాయి. బాడీకి కావలసిన ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అన్నిటికీ టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్ లెవల్స్ పెంచుకునే విధానం గురించి తెలుసుకుందాం.

వాల్ నట్స్‌లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తెల్ల నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇక బెల్లం ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ మూడు పదార్థాలు కలిపి లడ్డు తయారు చేయాలి.

ఒక కప్పు నువ్వులు దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. కప్పు వాల్ నట్స్ కూడా పొడి చేయాలి. తగినంత బెల్లం తీసుకుని మూడు కలిపి కొద్దిగా ఆవునెయ్యి జోడించి లడ్డూలు కట్టాలి. వీటిని రోజుకొకటి తింటూ ఉంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఈ లడ్డూ రక్త హీనత సమస్యను తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Tags:    

Similar News