Face Tips : కలబంద ఫేస్ వాష్.. ఇలా చేసుకోండి!

Update: 2024-05-04 04:49 GMT

కలబంద చర్మానికి చేసే మేలు గురించి మనందరికీ తెలుసు. చర్మానికి తేమను అందించడంతో పాటు, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి చర్మా నికి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని విధాలుగా చర్మా నికి మేలుచేసే కలబందతో ఫేస్ వాష్ ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసా

* తయారీకి కావలసినవి: అర కప్పు రోజ్ వాటర్, పావు కప్పు కలబంద గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల జొజోబా ఆయిల్, 4 స్పూన్ల లిక్విడ్ సోప్, అర టీస్పూను విటమిన్ ఇ ఆయిల్, 15 చుక్కల ఫ్రాంకెన్సెన్స్ ఆయిల్, 10 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, 5 చుక్కల జెరీనియం ఎసెన్షియల్ ఆయిల్

తయారీ ఇలా!

* ఒక గాజు పాత్రలో రోజ్ వాటర్, కలబంద గుజ్జు వేసి, రెండూ బాగా కలిసేలా గిలకొట్టాలి. తర్వాత లిక్విడ్ సోప్, జొజోబా అయిల్, ఎసెన్సి యల్ ఆయిల్స్, విటమిన్ ఇ ఆయిల్ వేసి, అన్నీ కలిసేలా గిలకొట్టాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని గరాటాతో ఓ గాజు సీసాలో నింపుకోవాలి.

* ఫ్రిజ్లో రెండు వారాల పాటు నిల్వ ఉంచి, వాడుకోవాలి.

* ముఖాన్ని కడుక్కోవడం కోసం ముందుగా ముఖాన్ని మంచి నీళ్లతో తడిపి, ఈ తడి చర్మా నికి కలబంద ఫేస్ వాష్ అప్లై చేయాలి. * నురగ వచ్చేవరకూ సున్నితంగా రుద్ది, గోరువె చ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.

ముఖం తడి లేకుండా తుడుచుకుని, వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

Tags:    

Similar News