Covid -19 : భయపడకండి.. కోవిడ్ పై ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాము : అరవింద్ కేజ్రీవాల్

Update: 2023-03-31 09:43 GMT

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులలో ఢిల్లీలో 48 కేసులు పాజిటీవ్ గా నమోదైనట్లు చెప్పారు. మార్చి 30న 295 కేసులు నమోదయ్యాయని.. ముగ్గురు మరణించారని తెలిపారు. కొత్త వేరియంట్ లు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో గుర్తించేందుకు కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నట్లు చెప్పారు. కోవిడ్ రోగుల కోసం ఢిల్లీ ఆసుపత్రుల్లో 7,986 పడకలు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం వద్ద తగినంత ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఐసోలేషన్ వార్డులను నిర్వహించాలని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదేశించినట్లు తెలిపారు.

ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. "మేము పరిస్థితిని సమీక్షించాము. లక్షణాలు ఉన్నవారికి కరోనావైరస్ పరీక్షలను సూచించమని ఆసుపత్రులను కోరాము. ఆసుపత్రులను సందర్శించే వ్యక్తులు మాస్క్‌లు ధరించాలి" అని ఆయన చెప్పారు. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Tags:    

Similar News