Rajasthan temple : 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యిని ఏం చేశారంటే?

ఆలయ శంకుస్థాపన కోసం భక్తులు 11 వేల లీటర్ల పాలు,పెరుగు, నెయ్యి సమర్పించారు. ఇలా చేయటం ఆచారం కాదు, భక్తితో వారు తెచ్చిచ్చారు

Update: 2020-12-28 09:24 GMT

Rajasthan Temple : రాజస్థాన్ లో ఓ ఆలయ భూమి పూజకోసం అక్కడి ప్రజల దాదాపుగా 11వేల లీటర్ల పాలు, పెరుగును సమర్పించారు. శనివారం జాల్వర్ లోని దేవనారాయణ దేవాలయ నిర్మాణానానికి శంకుస్థాపన జరిగింది. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వారంతా పాలు, పెరుగు, నెయ్యి తెచ్చి పునాది తీసిన గోతిలో పోశారు. దాదాపుగా 1500 లీటర్ల పెరుగు, ఒక క్వింటాల్ నెయ్యి, మిగతావి పాలు ఉన్నాయి. వీటి ఖర్చు దాదాపుగా రూ 1.50 లక్షలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనిపై ఆలయ నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధి రామ్‌లాల్‌ మీడియాతో మాట్లాడారు..

"ఆలయ శంకుస్థాపన కోసం భక్తులు 11 వేల లీటర్ల పాలు,పెరుగు, నెయ్యి సమర్పించారు. ఇలా చేయటం ఆచారం కాదు, భక్తితో వారు తెచ్చిచ్చారు. గతంలో కూడా ఇచ్చారు. దేవుడు మనకిచ్చే వాటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అయితే ఇది వృధా చేయడం మాత్రం కాదు. మేము ప్రతి చిన్న విషయానికి స్వామికి రుణపడి ఉంటాము. అయన మా పశుసంపదను రక్షిస్తాడు" అని ఆయన చెప్పారు. కోటి రూపాయలతో నిర్మించబడుతున్న ఈ ఆలయాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని రామ్‌లాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Tags:    

Similar News