Karnataka : కర్ణాటకలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
Karnataka: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి.;
Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో కొత్తగా 12 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. తాజా ఒమిక్రాన్ కేసులతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 31కి పెరిగిందన్నారు. అటు కేరళలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించారు. వీరిలో నలుగురు కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని చెప్పారు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్. ప్రస్తుతం వారందరికి హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతుందన్నారు. అందరి పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.