చిట్టితల్లి .. చనిపోతూ ఐదుగురిని బతికించింది!
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిట్టితల్లి పేరు ధనిష్తా.. ఢిల్లీకి చెందిన ఈ 20 నెలల చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లూ నిండాయి. ఈ నెల ఎనమిదో తేదిన బాల్కనీ నుంచి కిందపడింది.;
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిట్టితల్లి పేరు ధనిష్తా.. ఢిల్లీకి చెందిన ఈ 20 నెలల చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లూ నిండాయి. ఈ నెల ఎనమిదో తేదిన బాల్కనీ నుంచి కిందపడింది. దీనితో వెంటనే ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఈ నెల 11న ఆ చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.
బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలను దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. చిన్నారికి సంబంధించిన గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు రోగులకు దానం చేశారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది ధనిష్తా.. తమ బిడ్డ చనిపోయినప్పటికి.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.
అయితే దీనిపైన గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ డి.ఎస్.రానా మాట్లాడుతూ.. అవయవాలు లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సగటున ఐదు లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారు.. కుటుంబం చేసిన ఈ గొప్ప పని నిజంగా ప్రశంసనీయమని అన్నారు.