పీఎం కేర్స్‌కు బ్యాంకుల నుంచి రూ. 200 కోట్ల విరాళం
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరూ నడుంబిగించారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు.;
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరూ నడుంబిగించారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ కు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందించినట్టు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఏడు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కలిసి పీఎం కేర్స్‌కు రూ. 200 కోట్ల విరాళం ఇచ్చాయి. ఇందులో ఆర్బీఐ రూ. 7.34 కోట్లు ఇవ్వగా, ఎస్బీఐ తమ ఉద్యోగుల జీతాల్లో నుంచి రూ. 107.95 కోట్లు ఇచ్చింది. సీఎస్ఆర్, ఎల్ఐసీ, జీఐసీతో పాటు నేషనల్ హౌసింగ్ బ్యాంకు కలిపి రూ. 144.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేంద్ర విద్యా సంస్థలన్ని కలిసి రూ. 204.75 కోట్లు విరాళంగా ఇచ్చాయి