Ahmedabad Blasts : అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసు.. 38 మందికి మరణశిక్ష..!

Ahmedabad Blasts : అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Update: 2022-02-18 06:39 GMT

Ahmedabad Blasts : అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 38 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. 2008లో అహ్మదాబాద్‌ సిటీలో 18 చోట్ల ఇండియన్ ముజాహిదిన్ బాంబులు అమర్చింది. 70 నిమిషాల వ్యవధిలో దాదాపు 21 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు పేలుళ్లలో దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోగా...దాదాపు 200 మందికి పైగా గాయాలయ్యాయి. మరికొన్ని బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఈ కేసులో ఒకరు అప్రూవర్‌గా మారడంతో సిట్‌ ఆధారాలు సేకరించింది. 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.

Tags:    

Similar News