Uttar Pradesh: ప్రాణం తీసిన టీ.. అన్యాయంగా అయిదుగురు బలి
Uttar Pradesh: టీ తాగి ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు చనిపోయారు.;
Uttar Pradesh: టీ తాగి ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు చనిపోయారు.
ఇద్దరు పిల్లలు చిన్నారులు వారి తండ్రితో సహా ఐదుగురు వ్యక్తులు రసాయనం కలిపిన టీ తాగడంతో మరణించారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగ్లా కన్హై గ్రామంలో చోటు చేసుకుంది.
శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాంష్ (5), అతని బావ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (42) నాగ్లా కన్హై గ్రామంలోని తన ఇంట్లో చేసిన టీ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
శివానందన్ భార్య రామమూర్తి వరి పొలంలో పిచికారీ చేసే మందును టీ ఆకులుగా భావించి టీలో వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.