WAR: అక్కడ రణం.. ఇక్కడ భయం భయం

హైదరాబాద్‌లో ఇరాన్ యుద్ధ భయం.. ఇరాన్‌లో చదువుతున్న 900 మంది

Update: 2026-03-01 06:00 GMT

మధ్య­ప్రా­చ్యం­లో ఇజ్రా­యె­ల్–ఇరా­న్ మధ్య ప్రా­రం­భ­మైన యు­ద్ధం ప్ర­భా­వం వేల కి­లో­మీ­ట­ర్ల దూ­రం­లో ఉన్న హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కీ తా­కిం­ది. ఇరా­న్ రా­జ­ధా­ని టె­హ్రా­న్, పవి­త్ర నగరం కూ­మ్ల్లో చదు­వు­కుం­టు­న్న హై­ద­రా­బా­ద్‌­కు చెం­దిన వం­ద­లా­ది మంది వి­ద్యా­ర్థుల క్షే­మం­పై వారి కు­టుం­బా­లు తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­స్తు­న్నా­యి. శని­వా­రం ఉదయం అనూ­హ్యం­గా యు­ద్ధ పరి­స్థి­తు­లు నె­ల­కొ­న­డం, ఇజ్రా­యె­ల్ వై­మా­నిక దా­డు­ల­తో ఇరా­న్‌­లో ఉద్రి­క్త­త­లు పె­ర­గ­డం­తో నగ­రం­లో­ని పా­త­బ­స్తీ, టో­లీ­చౌ­కీ, సై­బ­రా­బా­ద్ ప్రాం­తా­ల్లో ని­వ­సిం­చే కు­టుం­బా­లు కల­వ­ర­ప­డు­తు­న్నా­యి. లభ్య­మైన సమా­చా­రం ప్ర­కా­రం హై­ద­రా­బా­ద్‌­కు చెం­దిన సు­మా­రు 900 మంది వి­ద్యా­ర్థు­లు టె­హ్రా­న్, కుమ్ నగ­రా­ల్లో వై­ద్య, మత, సాం­కే­తిక వి­ద్య­లు అభ్య­సి­స్తు­న్నా­రు. వీ­రి­తో పాటు ఇం­జి­నీ­ర్లు, వ్యా­పా­రు­లు కూడా తరచూ ఇరా­న్‌­కు రా­క­పో­క­లు కొ­న­సా­గి­స్తుం­టా­రు. మొ­త్తం రా­ష్ట్రా­ని­కి చెం­దిన వారు 2 వేల మం­ది­కి­పై­గా ఇరా­న్‌­లో ఉన్నా­ర­ని అం­చ­నా. యు­ద్ధం ఆక­స్మి­కం­గా ప్రా­రం­భ­మ­వ­డం­తో వారి పరి­స్థి­తి ఏం­ట­న్న దా­ని­పై స్ప­ష్టత లేక కు­టుంబ సభ్యు­లు ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు.

ఇరాన్ ప్రభుత్వం భద్రతా కారణాల వల్ల ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ ఉన్న విద్యార్థులతో సంప్రదింపులు కష్టమయ్యాయి. “మా పిల్లల ఫోన్లు పనిచేయడం లేదు. ఒక్క మెసేజ్ కూడా రావడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు” అంటూ పాతబస్తీకి చెందిన ఒక తల్లి కన్నీటి పర్యంతమైంది. సోషల్ మీడియా, కాల్స్ అందుబాటులో లేకపోవడం కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇదే సమ­యం­లో ఈ పరి­ణా­మా­ల­పై రా­జ­కీయ వర్గా­ల్లో­నూ చర్చ మొ­ద­లైం­ది. అబి­డ్స్‌­లో మీ­డి­యా­తో మా­ట్లా­డిన ఎంపీ అస­దు­ద్దీ­న్ ఒవై­సీ , ప్ర­ధా­న­మం­త్రి మోదీ పర్య­టన ము­గి­సిన వెం­ట­నే ఇజ్రా­యె­ల్ ఇరా­న్‌­పై దాడి జర­ప­డం అను­మా­నా­స్ప­ద­మ­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ దా­డుల గు­రిం­చి ముం­ద­స్తు సమా­చా­రం భారత ప్ర­భు­త్వా­ని­కి ఉందా అనే వి­ష­యం­పై ప్ర­జ­ల­కు సమా­ధా­నం చె­ప్పా­ల్సిన బా­ధ్యత కేం­ద్రం­పై ఉం­ద­ని అన్నా­రు. భారత వి­దే­శాంగ వి­ధా­నం శాం­తి, చర్చల మా­ర్గా­న్నే ప్రో­త్స­హి­స్తుం­ద­ని, ఈ దా­డు­లు ఆ వి­ధా­నా­ని­కి వి­రు­ద్ధ­మ­ని పే­ర్కొ­న్నా­రు. మధ్య­ప్రా­చ్యం­లో పరి­స్థి­తు­లు వే­గం­గా మా­రు­తు­న్న నే­ప­థ్యం­లో వి­దే­శా­ల్లో ఉన్న భా­ర­తీ­యుల భద్రత ప్ర­ధాన అం­శం­గా మా­రిం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వం పరి­స్థి­తు­ల­ను సమీ­క్షి­స్తూ అవ­స­ర­మైన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని కు­టుంబ సభ్యు­లు వి­జ్ఞ­ప్తి చే­స్తు­న్నా­రు. వి­ద్యా­ర్థుల క్షే­మం­పై స్ప­ష్ట­మైన సమా­చా­రం అం­దిం­చా­ల­ని కో­రు­తు­న్నా­రు. ప్ర­స్తు­తం యు­ద్ధ వా­తా­వ­ర­ణం కొ­న­సా­గు­తుం­డ­డం­తో టె­హ్రా­న్, కుమ్ నగ­రా­ల్లో పరి­స్థి­తు­లు ఎలా ఉన్నా­య­న్న దా­ని­పై స్ప­ష్టత లేదు.

Tags:    

Similar News