బెంగాల్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు 54.90 శాతం పోలింగ్..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలిదశలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు.;
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పశ్చిమబెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. తొలిదశలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బెంగాల్లో 54.90 శాతం పోలింగ్ జరగగా... అసోంలో 45. 24 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు 8 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ జరుగుతున్న తొలిదశలో 30 అసెంబ్లీ స్థానాలు పోలింగ్ కొనసాగుతోంది. అటు అసోంలో తొలి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.