Bihar : బిహార్ : నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఆరుగురు మృతి
Bihar : బిహార్ ముజఫర్‌పూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ నూడుల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.;
Bihar : బిహార్ ముజఫర్‌పూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ నూడుల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఉదయం పది గంటల టైంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం కిలోమీటర్ దూరం వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. పేలుడు శబ్ధం వినగానే వందలాది మంది ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు జిల్లా కలెక్టర్. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం నితీశ్ కుమార్. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.