Navalben Chaudhary : 62 ఏళ్ల వయసులో ఏడాదికి కోటి రూపాయల పాల వ్యాపారం!

ఆమె కష్టాన్ని వర్ణించడానికి కృషి, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి పదాలు కూడా తక్కువేనేమో. 62 ఏళ్ల వయసులో ఓ గ్రామీణ మహళ సాధించిన విజయం పెద్ద పెద్ద వ్యాపారులను సైతం విస్మయానికి గురి చేసింది.

Update: 2021-01-08 07:49 GMT

62 ఏళ్ల నవాల్బెన్ చౌదరి(Navalben Dalsangbhai Chaudhary) పాల వ్యాపారం ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. ఆమె కష్టాన్ని వర్ణించడానికి కృషి, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి పదాలు కూడా తక్కువేనేమో. 62 ఏళ్ల వయసులో ఓ గ్రామీణ మహళ సాధించిన విజయం పెద్ద పెద్ద వ్యాపారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఈ వయసులో కూడా ఆమె ఆరోగ్యంగా ఉండడానికి కారణం తాను చేసే పని. అదే ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.

ఇంట్లో డైరీ ఫామ్(dairy farm)! పాలు అమ్మడం వల్ల అవసరమైన ఆదాయం వస్తుంది. పాడి పరిశ్రమలు మంచి ఆదాయాన్ని సమకూర్చే వనరులు. కానీ కొందరికి వయసు సమస్య ఎదురవుతుంది. 62 ఏళ్ల నవల్‌బెన్‌కి వయసు అసలు సమస్యే కాలేదు. పాడి పరిశ్రమను నిర్మించాలని కలలు కన్న నవాల్‌బెన్‌ దగ్గర పశువులు, గేదెలు తక్కువగా ఉన్నాయి. దాంతో మరికొన్ని గేదెలను కొని వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తన ఇంట్లోనే ఒక చిన్న డెయిరీ ఫారమ్‌ని ప్రారంభించింది.


గ్రామంలో నివసిస్తున్న గ్రామ ప్రజలందరికీ ఆమె డైరీ ద్వారానే పాలు పోస్తుంది.ఆ విధంగా నవాల్బెన్  గ్రామంలోనే కాక ఆమె కీర్తి మొత్తం జిల్లాకు వ్యాపించింది. 2020 నాటికి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఓ చిన్న డైరీ ఫారం ద్వారా ఏడాదిలో 1.10 కోట్ల రూపాయలు సంపాదించింది. గతేడాది హోమ్ డెయిరీ ప్రారంభించిన నవాల్‌బెన్‌ దగ్గర ప్రస్తుతం 80 గేదెలు, 45 పశువులు ఉన్నాయి. మరో పది మంది ఆమె దగ్గర పనిచేస్తున్నారు. 

నా పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి మంచి జీతం కూడా వస్తుంది. అయితే వారి కంటే తానే ఎక్కువ సంపాదిస్తున్నానని గర్వంగా చెబుతోంది నవాల్‌బెన్. ఆమెకు రెండు లక్ష్మి అవార్డులు, మూడు ఉత్తమ పశుపాలక అవార్డులను ఇచ్చి సత్కరించారు జిల్లా అధికారులు.

Tags:    

Similar News