Srinagar to Kanyakumari: 67 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ తాతగారిలా..

Srinagar to Kanyakumari: ఆ వయసులో నాలుగు అడుగులు వేయడమే కష్టమనుకుంటే దాదాపు 4వేల కిలోమీటర్లు సైకిల్‌పై తిరిగేసి వచ్చారు ఈ తాతగారు.

Update: 2021-11-08 05:30 GMT

Srinagar to Kanyakumari: 60 ఏళ్ల వయసులో నాలుగు అడుగులు వేయడమే కష్టమనుకుంటే దాదాపు 4వేల కిలోమీటర్లు సైకిల్‌పై తిరిగేసి వచ్చారు ఈ తాతగారు. మహారాష్ట్రకు చెందిన మెహిందర్ సింగ్ భరాజ్‌ని వ‌ృద్ధుల కేటగిరిలో చేరుస్తూ సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లో చేరమని ఆహ్వానం వస్తే వెంటనే తిరస్కరించారు.. వయసు నా శరీరానికే కానీ నా మనసుకు కాదు అంటూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేందుకు ఆరోగ్యమైన ఆహారంతో పాటు, వ్యాయామం చేస్తానని చెబుతున్నారు.

రేస్ అగైనెస్ట్ ఏజ్ పేరుతో ఏకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశారు. ఆరుగురు సభ్యులున్న మిత్ర బృందంతో కలిసి రోజుకు 18 గంటల పాటు సైకిల్ తొక్కి 275 కిలో మీటర్లు ప్రయాణించినట్లు వెల్లడించారు. సెకిల్ యాత్ర ప్రారంభించాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. ఇందుకోసం ముందు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టానని అన్నారు.

రోజు విడిచి రోజు రెండు గంటలు, శని వారాల్లో ఆరుగంటలు సైకిల్ తొక్కానని తెలిపారు. ఇక మిగిలిన రోజుల్లో తన బాడీకి సహకరించే ఎక్సర్‌సైజ్‌లు జిమ్‌లో చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని యాత్రలు సైకిల్‌పై ప్రయాణించాలని ఉందని పేర్కొన్నారు. యాత్ర సాగినన్ని రోజులు రోజుకు 10వేల కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్నానని తెలిపారు. అందుకే 3600 కిలో మీటర్ల దూరాన్ని 12 రోజుల్లో అవలీలగా సైకిల్‌పై ప్రయాణించగలిగానని వివరించారు. 

Tags:    

Similar News