Google : మెటర్నిటీ లీవ్‌ పెడదామనుకుంది.. అంతలో ఉద్యోగం ఊడింది

Google: అన్ని సంస్ధలు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాన్ని అధిగమించాలంటే తక్కువ స్టాఫ్‌తో ఎక్కువ పని చేయించుకోవాలి.

Update: 2023-01-28 10:01 GMT

Google : అన్ని సంస్ధలు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాన్ని అధిగమించాలంటే తక్కువ స్టాఫ్‌తో ఎక్కువ పని చేయించుకోవాలి.అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి. ఆ దిశగానే అన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ లేఆఫ్ బాట పట్టి సడెన్‌గా ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తు్న్నాయి.. ముందస్తు సమాచారం లేకుండా కాల్ కట్ చేస్తున్నాయి. సదరు బాధితులు లింక్డిన్‌లో తమ బాధలను పంచుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగి Google యొక్క మాతృసంస్థ Alphabet Inc నుంచి తొలగించ బడిన విధానాన్ని పేర్కొంది.

తాను ఎనిమిది నెలల గర్భిణీ అని ప్రసూతి శెలవులు పెట్టుకుందామని అనుకునే లోపు #Googlelayoffs" అని మెయిల్ వచ్చింది. తనకి మంచి ఉద్యోగిగా పేరున్నప్పటికీ ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది.

సరిగ్గా ఒక నెలరోజుల్లో డెలివరీ అవుతాననగా ఇలాంటి వార్త నా చెవిని చేరడంతో నా పరిస్థితి ఎలా ఉందోనని మిగతా ఉద్యోగులు ఆందోళన చెందారు.. రోజంతా మెసేజ్‌లు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది. ప్రతికూల భావాలు నా మనసుని చేరనివ్వకూడదు. నన్ను నేను నియంత్రించుకున్నాను. Googleలో నా టీమ్‌ని నేను ఎంతో ప్రేమిస్తాను. ఎందుకంటే మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము.

నేను Googleలో ఉన్న సమయంలో నాకు లభించిన అవకాశాలు కెరీర్‌లో నా అభివృద్ధికి దోహదం చేశాయి. మనం పని పట్ల నిబద్ధతో ఉంటే మనకి ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి. ఇంతకు ముందు, Google మరియు Alphabet CEO సుందర్ పిచాయ్ లే ఆఫ్‌ల గురించి ప్రకటించి, " కొన్ని కష్టమైన వార్తలను పంచుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

మేము మా వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12,000 మందిని తగ్గించాలని నిర్ణయించుకున్నాము. ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాము. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది." అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News