Madhya Pradesh : కొత్త కోడలు కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్న రైతు..!
Madhya Pradesh : కోడలును తన ఇంటికి తీసుకురావడానికి ఏకంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు ఓ రైతు..;
Madhya Pradesh : కోడలును తన ఇంటికి తీసుకురావడానికి ఏకంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు ఓ రైతు.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోని బద్వాన్ గ్రామానికి రమేష్ ధాకడ్ వృత్తిరిత్యా రైతు.. అతనికి 25 ఎకరాల బిగాల ఉంది.. కిరాణం కూడా నడుపుతాడు.
అతనికి ఓకే ఒక్క కొడుకున్నాడు.. తన ఒక్కగానొక్క కొడుకు కోసం ఎప్పుడూ ఏదోకటి చేయాలని అనుకుంటూ ఉండే రమేష్.... హెలికాఫ్టర్‌లో కొడుకు, కోడలి పెండ్లి ఊరేగింపు ప్లాన్ చేశాడు.. స్కార్పియోలో పెండ్లి కూతురిని తీసుకురావాలని తాను అనుకుంటే తన తండ్రి ఏకంగా హెలికాఫ్టర్ బుక్ చేశాడని వరుడు యశ్వంత్ ధకడ్ చెప్పాడు
45 కిలోమీటర్ల దూరంలో పెండ్లి మంటపానికి ఊరేగింపు కోసం నవ జంటకు హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేయడంతో స్ధానికులంతా ఇదే టాపిక్ చర్చిస్తున్నారు. పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు, నేతలు హెలికాప్టర్‌లో వెళ్తారని, అలాంటప్పుడు రైతు కొడుకు హెలికాప్టర్‌లో ఎందుకు వెళ్ళకూడదని రమేష్ ప్రశ్నించారు.
తాను చేసింది కేవలం కొడుకు, కోడలు సంతోషం కోసమేనని ఆయన అన్నారు.