అమ్మ కోసం లక్షల్లో వస్తున్న జీతం వదిలి.. స్కూటర్‌పై..
కష్టపడి పెంచిన తల్లికి కొడుకు అభివృద్ధి ఆనందంగానే ఉంటుంది. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు లక్షల్లో జీతం వస్తుంది..
కష్టపడి పెంచిన తల్లికి కొడుకు అభివృద్ధి ఆనందంగానే ఉంటుంది. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు లక్షల్లో జీతం వస్తుంది.. ఇంతకంటే ఇంకేం కావాలి అని ఇరుగు పొరుగు వారు అనేవారు. కానీ అమ్మ ఎందుకో నిరుత్సాహంగా ఉంది.. తల్లి మనసును అర్థం చేసుకున్నాడు.. ఆమెను సంతోషంగా ఉంచడమే తన జీవిత పరమావధి అనుకున్నాడు.. బజాజ్ బైక్‌పైన పుణ్యక్షేత్రాలను తిప్పడం మొదలు పెట్టాడు..
కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ దక్షిణామూర్తి క్రిష్ణకుమార్ తల్లి కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి యాత్రికుడిగా మారాడు. 2018 జనవరి 16 నుంచి పుణ్యక్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టాడు. తండ్రి వాడిన బజాజ్ బండినే తాను వాడుతున్నాడు.. దానిపైనే అమ్మని ఎక్కించుకుని ఆలయాల సందర్శన చేస్తు్న్నాడు. మధ్యలో కొంత కాలంగా కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది.. ఇప్పుడు మళ్లీ యాత్ర మొదలు పెట్టారు తల్లీ
కొడుకులిద్దరూ. ఇప్పటికి దాదాపు 57వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశామని మీడియాకు వివరించారు. బండి మీద ప్రయాణిస్తూ ఇప్పటి వరకు తాము తిరిగిన రాష్ట్రాల లిస్ట్ చెప్పుకొచ్చారు.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కోల్‌కతా, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్, దేశాలు సందర్శించామని చెప్పారు. భగవంతుడు అనుగ్రహించినంతకాలం ఈ యాత్ర కొనసాగిస్తామని దక్షిణామూర్తి తెలిపారు.