Lottery : రూ. 30 పెట్టి కొంటే కోటి రూపాయలు తగిలింది... నేరుగా పొలీస్ స్టేషన్ కి వెళ్లి..!
Lottery : పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ వ్యక్తి రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటె ఏకంగా కోటి రూపాయలు తగిలింది.;
Lottery : పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ వ్యక్తి రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయలు తగిలింది. దీనితో రాత్రికి రాత్రే అతని లైఫ్ మొత్తం మారిపోయింది. షేర్‌క్రాపర్‌గా పనిచేస్తున్న మహబూబ్ కి డబ్బులు గెలుచుకోవాలన్నఅసక్తితో లాటరీ టికెట్లు కొనేవాడు.
ఓ రోజు ఆ అదృష్టం రానే వచ్చింది. ఆ అదృష్టం కోటి రూపాయలగా తలుపు తట్టింది. కానీ ముందుగా అతని దీనిని నమ్మలేదు. ఆ తర్వాత నేరుగా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ లాటరీ టికెట్‌తో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
తాను గెలిచిన భారీ మొత్తంతో ఏమి చేయాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మహబూబ్ చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య మరియు ముగ్గురు పిల్లల కోసం ఇల్లు నిర్మించడం తన చిరకాల కోరిక అని చెప్పాడు. దీంతో పాటు తన కొడుకులు, కూతుళ్లకు మెరుగైన విద్యను అందించాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు.