Sonu Sood : సోనూసూద్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు

Sonu Sood : పంజాబ్‌లోని మెగా శాసనసభ నియోజకవర్గ పరిధిలో.. నటుడు సోనుసూద్‌ను పోలీసులు అడ్డుకున్నారు.;

Update: 2022-02-20 11:30 GMT

Sonu Sood : పంజాబ్‌లోని మెగా శాసనసభ నియోజకవర్గ పరిధిలో.. నటుడు సోనుసూద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై సోనూ సూద్‌ సోదరి... మావికా పోటీ చేస్తున్నారు. అయితే సోనూ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారు ఫిర్యాదు చేశారు. దీంతో మోగా శాసన సభ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సోనూ సూద్‌ను.. పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు సోనూ వెళ్లకూడదని ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది.

Similar News