Union Budget 2021 : మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
అయితే బడ్జెట్ లో ఊరట కోసం ఎదురుచూస్తున్న సామన్యులకి కాస్తా నిరాశే మిగిలిందని చెప్పాలి.;
కేంద్ర బడ్జెట్ 2021 ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఇవ్వాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ లో ఊరట కోసం ఎదురుచూస్తున్న సామన్యులకి కాస్తా నిరాశే మిగిలిందని చెప్పాలి. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 4 వ్యవసాయ సెస్ విధించనున్నట్లు ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోలు రూ.100కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.