Air Asia: ఎయిర్ ఏసియా బంపరాఫర్.. ఉచితంగా టికెట్లు..
Air Asia: ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ఎవరికి మాత్రం ఉండదు.. అవకాశం రావాలే కానీ ఆకాశంలో విహరించాలని అందరికీ ఆశగానే ఉంటుంది.
Air Asia: ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ఎవరికి మాత్రం ఉండదు.. అవకాశం రావాలే కానీ ఆకాశంలో విహరించాలని అందరికీ ఆశగానే ఉంటుంది. ఎయిర్ ఏసియా సంస్థ అందించే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీకల నెరవేరుతుంది. నేషనల్, ఇంటర్‌నేషనల్ రూట్లలో ఏకంగా 50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈ వివరాలను కంపెనీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న కస్టమర్‌లు సెప్టెంబర్ 25 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ టికెట్ల ద్వారా జనవరి 1 నుంచి అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్ తెలిపారు. తమ వెబ్‌సైట్, మొబైల్ ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్న ఈ బిగ్ సేల్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ఏసియన్ దేశాల ప్రయాణికులు ఈ ఆఫర్‌కు అర్హులు.