Akhilesh Yadav : పెద్ద ట్విస్ట్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్.. !
Akhilesh Yadav : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ తొలిసారి పోటీచేసి కర్హాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు...;
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. ఇటీవల యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని అందరు అనుకున్నారు... కానీ ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ తొలిసారి పోటీచేసి కర్హాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు... ఈ క్రమంలో ఆయన ఎంపీగానే కొనసాగుతారన్న చర్చ నడిచింది. కానీ ఆయన శాసనసభ వైపే మొగ్గు చూపారు. అఖిలేశ్‌తో పాటుగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఆజంఖాన్ కూడా తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి రాగా, 111 స్థానాలను దక్కించుకొని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ నిలిచింది. ప్రస్తుతం పార్లమెంటులో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల సంఖ్య మూడుకు తగ్గింది.