Amarinder Singh New Party: తన పార్టీకి 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అని నామకరణం చేసిన అమరీందర్ సింగ్..
Amarinder Singh New Party: పంజాబ్‌లో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది.;
Amarinder Singh New Party: పంజాబ్‌లో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తపార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరు ప్రకటించారు. కొత్త పార్టీ గుర్తును ప్రకటించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తుందని కెప్టెన్ ట్వీట్ చేశారు.
అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా చేయడానికి గల కారణాలను లేఖలో వెల్లడించారు. కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్టానం పశ్చాత్తాప పడక తప్పదని కెప్టెన్ హెచ్చరించారు.
కాంగ్రెస్ లోనూ, ప్రభుత్వంలోనూ సిద్ధూకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు .. తన ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో.. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో..అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతాయంటున్నారు రాజకీయ నిపుణులు