Amarinder Singh : పంజాబ్ పోల్స్.. తొలిజాబితాను ప్రకటించిన అమరీందర్ సింగ్
Amarinder Singh : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అద్యక్షుడు అమరీందర్ సింగ్ 22 మందితో కూడిన మొదటి అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు.;
Amarinder Singh : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అద్యక్షుడు అమరీందర్ సింగ్ 22 మందితో కూడిన మొదటి అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. ఇందులో తొమ్మిది మంది జాట్ సిక్కులు, నలుగురు ఎస్సీ, ముగ్గరు ఓబీసీ అభ్యర్దులున్నారు. మరో రెండు రోజుల్లో రెండో జాబితాని రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక తాను పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రకటించిన జాబితాలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ కూడా ఉన్నారు. బీజేపీ మరియు ఎస్‌ఎడి (సంయుక్త్)తో పొత్తులో భాగంగా117 సీట్లకి గాను పిఎల్‌సి ప్రస్తుతం 37 స్థానాలను పొందింది.