Amit Shah: మోదీ ప్లేస్‌లో అమిత్ షా.. ఉక్కుమనిషికి నివాళి..
Amit Shah: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఘన నివాళులు అర్పించారు అమిత్‌షా.;
Amit Shah (tv5news.in)
Amit Shah: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఘన నివాళులు అర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఇవాళ గుజరాత్ CM భూపేంద్ర పటేల్‌తో కలిసి ఆయన నర్మదా తీరంలోని కేవడియాకు వెళ్లారు. అక్కడి సర్దార్ విగ్రహం వద్ద అంజలి ఘటించారు. దేశ తొలి ఉప ప్రధాని అయిన వల్లభాయ్ పటేల్ పుట్టినరోజయిన అక్టోబర్ 31ని కేంద్రం రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహం వద్ద జవాన్ల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 9 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన 75 మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే బైక్‌యాత్ర పూర్తి చేసిన 101 మంది కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ప్రధాని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండడంతో అమిత్‌షా ఏక్తా దివస్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో ద్వారా తన సందేశాన్ని అందించారు.