అస్సాంలో అమిత్ షా.. నేతాజీ చిత్రపటానికి పుష్పాంజలి
బెంగాల్ నుంచి రష్యా వరకు నేతాజీ సాగించిన యాత్రను అమిత్ షా గుర్తు చేశారు.;
అస్సాంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నేతాజీ 125వ జయంతి సందర్భంగా.. ఆయన చిత్ర పటానికి గౌహతిలో శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడిన గొప్పవ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అమిత్ షా అన్నారు. నేతాజీని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా... 125 జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. బెంగాల్ నుంచి రష్యా వరకు ఆయన సాగించిన యాత్రను అమిత్ షా గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం బోస్ సాగించిన పోరాటాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు అమిత్ షా.