Sheikh Heera: అప్పటివరకు అంబులెన్స్ డ్రైవర్.. అంతలోనే కోటీశ్వరుడు..

Sheikh Heera: ఒక్కొక్కసారి పేపర్లో, టీవీల్లో వచ్చే కొన్ని వార్తలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

Update: 2021-12-13 06:27 GMT

Sheikh Heera (tv5news.in)

Sheikh Heera: ఒక్కొక్కసారి పేపర్లో, టీవీల్లో వచ్చే కొన్ని వార్తలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అరే.. ఇంత అదృష్టవంతులు కూడా ఉంటారా అనిపిస్తుంటుంది. ఉన్నపళంగా కోటీశ్వరులు అయిపోయిన వారు కూడా ఉంటారు. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్‌ లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా అనే అంబులెన్స్ డ్రైవర్.

షేక్ హీరాకు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగానే అతడు ఇటీవల రూ. 270 పెట్టి లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అదే రోజు మధ్యాహ్నానికి అతడు కొనుగోలు చేసిన లాటరీ టికె‌ట్‌కు రూ.కోటి రూపాయల లాటరీ తగిలిందనే సమాచారం అందింది. వెంటనే అతడు సంతోషంలో మునిగిపోయాడు. కానీ అంతలోనే తనకు ఒక సందేహం వచ్చింది.

రూ.కోటి విలువ చేసే లాటరీ టికెట్ తన వద్ద ఉందని తెలిస్తే ఎవరైనా కొట్టేస్తారేమో అని భయపడిన షేక్ హీరా వెంటనే లాటరీ టికెట్ తీసుకొని శక్తిగఢ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు లాటరీ తగిలిందని, ఎవరైనా కొట్టేస్తారేమో అని భయమేస్తుంది అని చెప్పాడు. దీంతో పోలీసులు అతడి ఇంటి ముందు కాపలాను పెట్టారు.

షేక్ హీరా తాను గెలుచుకున్న లాటరీ గురించి మాట్లాడుతూ.. తాను ఏదో ఒక రోజు జాక్‌పాట్ గెలుస్తానని కలలు కంటూ ఉండేవాడని, అందుకే ఎప్పుడూ లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడని తెలిపాడు. వచ్చిన డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని, తాను కుటుంబంతో సంతోషంగా ఉండడానికి మంచి ఇళ్లు నిర్మించుకుంటానని చెప్పాడు.

Tags:    

Similar News