Anand Mahindra: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రోడ్లు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra: స్పీడుగా పోతున్న బండికి బలవంతంగా బ్రేకులు వేయిస్తుంది ట్రాఫిక్ సిగ్నల్. తిట్టుకుంటూనే తప్పదన్నట్లు ఆగిపోతాయి వాహనాలన్నీ.

Update: 2023-02-27 07:09 GMT

Anand Mahindra: స్పీడుగా పోతున్న బండికి బలవంతంగా బ్రేకులు వేయిస్తుంది ట్రాఫిక్ సిగ్నల్. తిట్టుకుంటూనే తప్పదన్నట్లు ఆగిపోతాయి వాహనాలన్నీ. కొంతమంది మహానుభావులు ఆ కాస్త సమయం కూడా చాలా విలువైందిగా భావించి ట్రాఫిక్ సిగ్నల్స్‌ని జంప్ చేస్తుంటారు. మొత్తానికి బిజిగా ఉన్న నగర రోడ్ల మీద సమయానికి గమ్య స్థానం చేరుకోవడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా సీఈవో ఆనంద్ మహీంద్రా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే హ్యాపీగా తక్కువ సమయంలో గమ్యస్తానం చేరుకోవచ్చు కదా అని వివరిస్తూ.. అదే ఆలోచనతో డిజైన్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న రోడ్డులో వాహనాలు ఎక్కడా ఆగే అవసరం లేకుండా ముందుకు సాగుతున్నాయి.

యెమెన్‌కు చెందిన మహమ్మద్ అవాస్ అనే ఇంజనీర్ ఈ డిజైన్‌ను 2016లో రూపొందించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా నిరంతరం ట్రాఫిక్ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ దీని ద్వారా పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుందేమో అని ఆనంద్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన అధిక శాతం మంది నెటిజన్లు స్సందిస్త.. ట్రాఫిక్ క్రమబద్ధీ్కరణకు సిగ్నల్స్ కచ్చితంగా అవసరం. లేకపోతే వాహనదారులకు ఇబ్బందులు తప్పవు, ఈ డిజైన్ అంత ఆమోదయోగ్యంగా లేదు అని కామెంట్ చేస్తున్నారు. 

Tags:    

Similar News