వచ్చే ఏడాది సెలవుల లిస్ట్..

ఆదివారాలు, రెండో శనివారాలు మినహాయించి 22 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రకటించింది.;

Update: 2020-12-16 06:31 GMT

వచ్చే ఏడాదిలో సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయి అని ఎదురు చూసే వారి కోసం సెలవుల లిస్ట్‌ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిలో మొత్తం 40 సెలవులు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారాలు, రెండో శనివారాలు మినహాయించి 22 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇక ఉద్యోగులు, అధికారులు ముందుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 18 ఐచ్ఛిక సెలవుల్లో 5కు మించకుండా వాడుకోవచ్చని తెలిపారు. అయితే, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యా సంస్ధలు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవు.






 



 



 


 


 

Tags:    

Similar News