దండాలు డాక్టరమ్మా.. కేవలం రూ.10 ఫీజుతో వైద్యం

అయిదొందలు ఫీజైనా అయిదు రోజులు మాత్రమే చెల్లుతుంది.. ఆరో రోజు వచ్చినా మళ్లీ అయిదొందలు సమర్పించుకోవాల్సిందే..;

Update: 2020-12-21 11:34 GMT

వచ్చిన రోగం కంటే వైద్యం చేయించుకోవాలంటే వణుకొస్తుంది.. దవాఖానకు పోతే ఏం టెస్టులు రాస్తారో.. ఏం చెబుతారో అని భయం.. అయిదొందలు ఫీజైనా అయిదు రోజులు మాత్రమే చెల్లుతుంది.. ఆరో రోజు వచ్చినా మళ్లీ అయిదొందలు సమర్పించుకోవాల్సిందే.. అలాంటిది రూ.10 ఫీజు తీసుకుని వైద్యం చేస్తున్న డాక్టర్ పర్వీన్ ఆ ఊరి రోగుల పాలిట దేవత.

సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉత్తమమైన వైద్య సేవలను అందించే ప్రయత్నంలో, నూరి పర్వీన్ అనే యువ వైద్యురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప పట్టణంలో ఒక ప్రైవేట్ క్లినిక్‌ను స్థాపించారు. డాక్టర్ పర్వీన్ యొక్క ప్రత్యేకత ఆమె దగ్గరకు వచ్చే రోగుల నుంచి నామమాత్రపు ఫీజు రూ .10 వసూలు చేస్తుంది.

పర్వీన్ విజయవాడ నగరంలో పుట్టి పెరిగింది. తరువాత ఆమె కడప మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ డిగ్రీ పూర్తి చేసింది. పర్వీన్ ఔట్ పేషెంట్ల నుంచి రూ. 10, ఇన్‌పేషెంట్ల నుంచి రూ. 50 వసూలు తీసుకుంటారు.. ఆమె ప్రతిరోజూ కనీసం 40 మంది రోగులకు చికిత్స చేస్తుంది. మానవాళికి సేవ చేయాలనే ప్రేరణ తన తల్లిదండ్రుల నుండి వచ్చిందని, పేదవారికి సహాయపడాలనే గుణాన్ని నేర్పింది తల్లిదండ్రులే అని చెబుతుంది డాక్టర్ పర్వీన్.

పేదవారికి విద్య మరియు ఆరోగ్యం కోసం ఆమె రెండు సంస్థలను ప్రారంభించింది-అవి ఇన్స్పైరింగ్ హెల్తీ యంగ్ ఇండియా ఒకటైతే, నూర్ ఛారిటబుల్ ట్రస్ట్ మరొకటి. అంతేకాకుండా, మనస్తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సంపాదించాలని పర్వీన్ యోచిస్తున్నారు. దేశంలోని నిరుపేద వర్గాలకు సహాయం చేయడానికి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News