ఇంటర్ అర్హతతో ఏపీలో ఉద్యోగాలు..
ఈ పోస్టులకు ఇంటర్, ఆపైన విద్యార్హతలు కలిగిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.;
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని Reliance Retail లో 200 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు సీఆర్‌డీఏ రీజియన్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్, ఆపైన విద్యార్హతలు కలిగిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. వయస్సు 22-30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు టూ వీలర్‌తో పాటు స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,500 వేతనంతో పాటు పనితీరు ఆధారంగా రూ.6 వేల వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి.