Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనాథలైన పిల్లలకు నెలకు రూ. 2500.. !

Arvind Kejriwal : కరోనాతో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారులకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు.. ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు.

Update: 2021-05-18 14:11 GMT

Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కరోనాతో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారులకు 25 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు.. ఉచిత విద్య అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అటు కరోనాతో మరణించిన కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఒక కుటుంబానికి రూ.50 వేల చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ఇక ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోయిన భార్యకు వివాహం కానీ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నా పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందిస్తామన్నారు. ప్రస్తుతం నెలకు ఐదు కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ.. ఈనెల మరో అయిదు కేజీలు అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News