Arvind Kejriwal : అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం..!
Arvind Kejriwal : పంజాబ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే అనేక హామీలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.;
Arvind Kejriwal : పంజాబ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే అనేక హామీలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాము అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,000 అందజేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
సోమవారం పంజాబ్‌లోని మోగాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము 2022లో పంజాబ్‌లో అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,000 అందజేస్తామని అన్నారు. దీనిని అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.
కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు అడగకుండా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రజయోజనం కలిగిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇక ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న మహిళలకు వాటిని కొనసాగించడంతో పాటు అదనంగా వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేస్తామన్నారు.