ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్!
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణం అయిన వారికి కేజ్రీవాల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు.Arvind Kejriwal;
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణం అయిన వారికి కేజ్రీవాల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌లో పార్టీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే ఢిల్లీలో జరిగిన హింసను ఖండించలేదన్నారు. కాగా, పంజాబ్ లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సంగతి విదితమే. రైతుల ర్యాలీలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన పోలీస్ సిబ్బందిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించిన వీడియోను గౌతం గంభీర్ సోషల్ మీడియాలో రీట్వీట్ చేశారు.