Harshita Kejriwal : సీఎం కూతురినే మోసం చేసిన కేటుగాడు.. 34వేలు దోచేశాడు!

Harshita Kejriwal : ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌లో సెకండ్‌ హ్యాండ్‌ సోఫాను అమ్మలనుకున్న హర్షితకు కేటుగాడు పెద్ద షాక్ ఇచ్చాడు.

Update: 2021-02-08 14:22 GMT

Harshita Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షితా కేజ్రీవాల్ ను ఓ కేటుగాడు మోసం చేశాడు. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌లో సెకండ్‌ హ్యాండ్‌ సోఫాను అమ్మలనుకున్న హర్షితకు కేటుగాడు పెద్ద షాక్ ఇచ్చాడు. మొదటగా కొద్ది మొత్తంలో డబ్బును హర్షితా అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసి ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి ఆమె అకౌంట్‌లోని 34వేల రూపాయలను దోచేశాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News