80-year-old engineer appears for IIT: 80 ఏళ్ల వయసులో IIT-మద్రాస్ ప్రవేశ పరీక్షకు హాజరు.. గేటు వద్ద ఆపిన సెక్యూరిటీ..

80-year-old engineer appears for IIT: చదువుకు వయసుతో పనేముంది.. ఇష్టం ఉంటే చాలు.. ఏ వయసు వారైనా హ్యాపీగా చదువుకోవచ్చు.. కొంత మంది నిరంతర విద్యార్థులు ఉంటారు.;

Update: 2022-06-07 07:53 GMT

80-year-old engineer appears for IIT: చదువుకు వయసుతో పనేముంది.. ఇష్టం ఉంటే చాలు.. ఏ వయసు వారైనా హ్యాపీగా చదువుకోవచ్చు.. కొంత మంది నిరంతర విద్యార్థులు ఉంటారు.. ఏదో ఒకటి చదువుతూ, రాస్తూ, తెలుసుకుంటూ ఉంటారు.. ఆ కోవకే వస్తారు ఎనభై ఏళ్ల ఇంజనీర్ నందకుమార్ కె. మీనన్‌. ఐఐటీ మద్రాస్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

ఆగస్టులో 81 ఏళ్లు నిండనున్న ఈ ఇంజనీర్‌ IIT-మద్రాస్ అందించే ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్‌లో ఆన్‌లైన్ కోర్సుకు అప్లై చేశారు. ఆదివారం అలువాలోని ఐటీ సంస్థ ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష జరిగింది.

IIT మద్రాస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో, మీనన్ ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటల వరకు చదివేవారు. అంతేకాకుండా, అతను UAEకి చెందిన న్యాయవాది అయిన తన కుమారుడు సేతు నందకుమార్‌తో కలిసి నాలుగు సబ్జెక్టులలో నాలుగు వారాల పాటు జరిగే తరగతులకు కూడా హాజరయ్యారు.

మీనన్ గణితం, గణాంకాలు, డేటా ప్రాసెసింగ్, ఇంగ్లీషు సబ్జెక్టులపై వారానికోసారి (మొత్తం 16) పరీక్షలకు హాజరుకావాలి. ఆదివారం నాటి ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడానికి అన్ని సబ్జెక్టులలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.

ఒకప్పటి ప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నుండి ప్రేరణ పొందిన మీనన్, 4వ తరగతిలో ఉన్నప్పటి నుండి ఇంజనీర్ కావాలనుకున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంజనీర్ చదవలేకపోయారు. కానీ తరువాత చదువుపై ఉన్న ఇష్టంతో గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం నుండి ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్నారు.

ఆ తర్వాత, మీనన్ NASA- స్కాలర్‌షిప్‌తో USలోని సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

ఐఐటి-మద్రాస్ అందించే ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్‌లో ఆన్‌లైన్ కోర్సుకు అప్లై చేశారు. ఇది నాలుగు గంటల నిడివి గల ఆన్‌లైన్ పరీక్ష. దీనిని రాయడానికి తనను గేట్ వద్ద ఆపిన సెక్యూరిటీ గార్డులను తాను ఒప్పించాల్సి వచ్చిందని మీనన్ మీడియాతో చెప్పారు.

ఈ కేంద్రంలో ఆన్‌లైన్ పరీక్షకు హాజరైన 120 మంది అభ్యర్థుల్లో 90% మంది యువతేనని ఆయన తెలిపారు. పరీక్షకు హాజరైన తనను అందరూ వింతగా చూశారని అన్నారు. 

Tags:    

Similar News