Accident: కారు మీద పడ్డ సిమెంట్ మిక్సర్ డ్రమ్.. తల్లీ, కూతురు మృతి
Accident: రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా వేరేవాళ్ల అజాగ్రత్త మన ప్రాణాల మీదకు తెస్తుంది.;
Accident: మృత్యువు ఎటు నుంచి ముంచుకు వస్తుందో తెలియదు. రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా వేరేవాళ్ల అజాగ్రత్త మన ప్రాణాల మీదకు తెస్తుంది. కొన్ని సంఘటనలు అసలు ఊహించను కూడా లేం. ఖర్మ వెంటాడితే దానిని ఎవరూ తప్పించలేరు.
బెంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్.. తమ తప్పు లేక పోయినా తల్లీ కూతుళ్లు బాధ్యులయ్యారు.. ప్రాణాలు కోల్పోయారు. కాంక్రీట్ మిక్సర్ ట్రక్కు బ్యాలెన్స్ తప్పి వార ప్రయాణిస్తున్న కారుపై పడిపోవడంతో 46 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె మృత్యువాత పడ్డారు. దీంతో హతాశుడైన కాంక్రీట్ మిక్సర్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
గాయత్రి అనే మహిళ తన కుమార్తె సమతను (15) స్కూల్‌లో దింపేందుకు వెళ్లగా అటువైపు నుంచి వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ అదుపు తప్పి వారి కారుపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటన బెంగళూరు రూరల్‌లోని బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలోని కగ్గలిపుర క్రాస్ వద్ద చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. చాలా సేపు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను నాలుగు క్రేన్లు, జేసీబీ సాయంతో వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.