మోదీ బంగ్లా పర్యటన ముగిసినా ఆగని అల్లర్లు.. !

మోదీ బంగ్లా పర్యటన ముగిసినప్పటికీ అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ఇవాళ్టికి కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లా అల్లర్లలో ఇప్పటి వరకు 11 మంది ఆందోళనకారులు చనిపోయారు.

Update: 2021-03-29 09:15 GMT

మోదీ బంగ్లా పర్యటన ముగిసినప్పటికీ అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ఇవాళ్టికి కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లా అల్లర్లలో ఇప్పటి వరకు 11 మంది ఆందోళనకారులు చనిపోయారు. ఆస్తులను ధ్వంసం కొనసాగుతోంది. వాహనాలు, షాపులను తగులబెడుతుండడం, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు.

దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటించారు. మోదీ పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్‌ వాదులు ఆందోళనలు చేపట్టారు. మోదీ హయాంలో భారత్‌లో ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఆరోపిస్తూ వందల మంది ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

బంగ్లాదేశ్‌లో మదర్సాలను నిర్వహించే హెఫాజత్‌ ఇ ఇస్లాం అనే సంస్థ నిరసన తెలుపుతోంది. నిన్న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ సంస్థ విద్యార్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నారు. బ్రాహ్మణ్‌బరియా జిల్లాలో ఆందోళనకారులు రైలును తగలబెట్టడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించి నిప్పటించారు.

సెంట్రల్‌ లైబ్రరీని కూడా దహనం చేశారు. ప్రెస్‌ క్లబ్‌పైనా, పాత్రికేయులపైనా దాడులు చేశారు. ఈ పట్టణంలోని హిందూ దేవాలయాలపైనా దాడులు జరిగాయి. ఎక్కడికక్కడ రోడ్లకు అడ్డంగా ఇసుక బస్తాలు, పెద్ద పెద్ద దుంగలను ఉంచారు.

Tags:    

Similar News