Bank Holidays in August 2022: ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులో..

Bank Holidays in August 2022: మరో వారం రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది.. పండగల సీజన్ మొదలవుతుంది.. ముఖ్యంగా ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వస్తుంటాయి.

Update: 2022-07-25 09:30 GMT

Bank Holidays in August 2022: మరో వారం రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది.. పండగల సీజన్ మొదలవుతుంది.. ముఖ్యంగా ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వస్తుంటాయి. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, మోహర్రం, స్వాతంత్ర్య దినోత్సవం ఇలా వరుస పండగలు అన్నీ ఆగస్ట్‌లోనే ఉంటాయి. దాంతో బ్యాంకులకు సెలవులు కూడా వస్తాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందు జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి.

ఆగస్ట్ నెలలో సెలవలు ఎన్ని ఉంటాయో తెలుపుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితాను శనివారం విడుదల చేసింది. ఆగస్ట్ నెలలో శని, ఆదివారాలు కలిపి ఆరు సెలవులు.

ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ నెలలో మొత్తం 9 రోజులు బ్యాంకులు పని చేయవు. గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పని చేయవు. అలాగే ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో కూడా బ్యాంకులు పని చేయవు. ఇవి కాకుండా ఆయా రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

ఆగస్టు 8, 9: మోహర్రం

ఆగస్టు 11, 12, శుక్ర, శని : రక్షా బంధన్‌

ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 18,గురువారం: జన్మాష్టమి

ఆగస్టు 20, శనివారం: శ్రీకష్ణాష్టమి

ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి

ఆగస్టు 7: ఆదివారం

ఆగస్టు 13 : శనివారం

ఆగస్టు 14: ఆదివారం

ఆగస్టు 21: ఆదివారం

ఆగస్ట్‌ 27: నాల్గో శనివారం

ఆగస్టు 28: ఆదివారం

Tags:    

Similar News