Bank Holidays: బీ అలర్ట్.. బ్యాంకులకు వచ్చేవారం వరుస సెలవులు..

Bank Holidays: అక్టోబర్ 18 సోమవారం నుండి వచ్చే వారంలో భారతదేశం అంతటా బ్యాంకులు ఆరు రోజులు మూసివేయబడతాయి.

Update: 2021-10-18 08:57 GMT

Bank Holidays: అక్టోబర్ మొదటి భాగంలో, బ్యాంకులు 13 రోజులు మూసివేయబడ్డాయి. అక్టోబర్ 16, శనివారం, దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి. అక్టోబర్ 17 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ 18 సోమవారం నుండి వచ్చే వారంలో భారతదేశం అంతటా బ్యాంకులు ఆరు రోజులు మూసివేయబడతాయి.

అక్టోబర్‌లో మొత్తం 21 బ్యాంకు సెలవులు ఉన్నాయి .

అక్టోబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్యాంక్ సెలవులు

అక్టోబర్ 18: కాటి బిహు కారణంగా అస్సాంలోని గౌహతిలో బ్యాంకులు మూసివేశారు.

అక్టోబర్ 19: మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా, న్యూఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగపూర్, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 20: వాల్మీకి జయంతి కారణంగా బెంగళూరు, చండీగఢ్, సిమ్లా, కోల్‌కతా, అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.

అక్టోబర్ 22: ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాత జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్.

అక్టోబర్ 23: నాల్గవ శనివారం కారణంగా భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

అక్టోబర్ 24: ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి.

ఆర్‌బిఐ సెలవులను మూడు కేటగిరీలలో ప్రకటిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల అకౌంట్స్ క్లోజింగ్‌ రోజును హాలిడేగా ప్రకటిస్తుంది. 

Tags:    

Similar News