Pragya Thakur : మరోసారి వార్తల్లోకెక్కిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
Pragya Thakur : మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు;
Pragya Thakur : BJP ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వార్తాల్లో నిలిచారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఐతే తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్ శక్తినగర్ ఏరియాలోని ఓ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. గతంలో ఓ సారి ప్రగ్యా ఠాకూర్ డ్యాన్స్ చేసిన వీడియో, బాస్కెట్ బాల్ ఆడిన వీడియో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. 2008లో మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పేలుళ్లలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రగ్యా ఠాకూర్‌కు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున భోపాల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.